బిగ్ బ్రేకింగ్ : కాంగ్రెస్‌లో చేరిన షర్మిల

by Sathputhe Rajesh |   ( Updated:2024-01-04 06:19:42.0  )
బిగ్ బ్రేకింగ్ : కాంగ్రెస్‌లో చేరిన షర్మిల
X

దిశ, వెబ్‌డెస్క్: వైస్సాఆర్టీపీ చీఫ్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో గురువారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే షర్మిలకు కాంగ్రెస్ కండువా కప్పారు. ఈ సందర్భంగా షర్మిల వైఎస్సాఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. తాను నాన్న వైఎస్సాఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నానన్నారు. వైఎస్సాఆర్ జీవితమంతా కాంగ్రెస్ కోసం పనిచేశారన్నారు. వైఎస్సాఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్సే అన్నారు. షర్మిల వెంట ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నారు. ఇక, షర్మిలకు ఏపీ బాధ్యతలను కాంగ్రెస్ హైకమాండ్ ఇవ్వనున్నట్లు తెలిసింది.

Read More:

కాంగ్రెస్‌లో చేరిన తర్వాత షర్మిల ఫస్ట్ రియాక్షన్ ఇదే..!

Advertisement

Next Story