- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్.. కవిత సన్నిహితుల ఇండ్లలో ఈడీ సోదాలు?
దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఢిల్లీ నగరంతోపాటు గుర్‌గావ్, లక్నో, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచే 30 చోట్ల వేర్వేరు బృందాలుగా ఏర్పడిన ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న రామచంద్రన్ పిళ్ళై నివాసం, ఆఫీసు, ఆయనకు చెందిన రాబిన్ డిస్టిల్లరీలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇతనితో సంబంధం ఉన్న సృజన్ రెడ్డి, అభిషేక్‌రావు, గండ్ర ప్రేమ్ సాగర్ నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ స్కామ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉన్నదంటూ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్‌రావు నివాసంలోనూ సోదాలు జరుగుతున్నట్లు ఈడీ వర్గాలు ప్రాథమిక సమాచారం ఇవ్వడం గమనార్హం. ఎమ్మెల్సీ కవితకు అభిషేక్‌రావు సన్నిహితులుగా ఉన్నందునే ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు సీబీఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానాలు తలెత్తడంతో ఈడీ నోటీసులు జారీచేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఏక కాలంలో ఆరు నగరాల్లో 30 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఇందులో హైదరాబాద్ నగరంలోనే ఆరు ప్రాంతాలు ఉన్నాయి. ఢిల్లీ డిఫ్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలో మాత్రం సోదాలు జరపడం లేదని ఢిల్లీలోని ఈడీ వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి.
Also Read : లిక్కర్ స్కాంతో కవితకు లింకు.. ఫొటోలు బయటపెట్టిన ఎమ్మెల్యే రఘునందన్ రావు
Also Read : ఢిల్లీ లిక్కర్ స్కాం.. దేశవ్యాప్తంగా 30 చోట్ల ఈడీ సోదాలు..