- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BIG BREAKING: గులాబీ బాస్‌కు మరో బిగ్ షాక్.. బీజేపీలోకి నామా నాగేశ్వర్ రావు?
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో కుంగిపోతున్న గులాబీ బాస్‌కు సొంత పార్టీ నేతలు షాకుల మీద షాకులిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన వేళ ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన రేపు లేదా ఎల్లుడి ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్ర నాయకులు సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నట్లు సమచారం. కాగా, కేసీఆర్ ఇప్పటికే 17 ఎంపీ స్థానాలకు గాను 16 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించారు. ఖమ్మం స్థానాన్ని ఈ సారి మళ్లీ నామాకే కట్టబెట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ పెద్దలు ఆయనపై కన్నేశారు.
నామాను పార్టీలో చేర్చుకుని టీడీపీలో పొత్తులో భాగంగా ఖమ్మం సీటు కట్టబెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా వారు కూడా అందుకు అంగీకరం తెలిపారని తెలుస్తోంది. ఖమ్మం పార్లమెంటు పరిధిలో కమ్మ సామాజిక వర్గ ఓట్లు, టీడీపీకి ఉన్న బలం నామా గెలుపునకు దోహదం చేస్తాయని పార్టీ భావిస్తోంది. అయితే, ఇటీవలే ఖమ్మం సీటు ఆశించి ఇప్పటికే ఆ పార్టీలో చేరిన జలగం వెంకట్రావ్‌కు మొదట సీటు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ, వెంకట్రావు స్థానికంగా బలం లేకపోవడం, వ్యతిరేకత ఉండటంతో చివరికి నామా నాగేశ్వర్ రావును పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. అయితే, నామా ఎప్పుడు బీజేపీలో చేరుతారనే విషయంలో మరో రెండు రోజుల్లో తేలనుంది.