- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్ : అమెరికా అధ్యక్షుడి హత్యకు తెలుగు యువకుడు భారీ కుట్ర
దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు కుట్ర కేసులో తెలుగు సంతతికి చెందిన యువకుడు అరెస్ట్ కావడం కలకలం రేపింది. బైడెన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు హాని తలపెట్టాలనే ఉద్దేశంతో సాయి వర్షిత్(19) ఓ భారీ ట్రక్కుతో వైట్ హౌస్ పరిసరాల్లోకి దూసుకు వచ్చాడు. ట్రాఫిక్ బారియర్స్ ను ఢీ కొట్టి బీభత్సం సృష్టించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ట్రక్కుపై నాజీకి సంబంధించిన స్వస్తిక్ జెండా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. బైడెన్ లేదా అతడి కుటుంబ సభ్యులకు హాని తలపెట్టాలనే తాను ఈ కుట్ర చేసినట్లు సాయివర్షిత్ అంగీకరించాడు. నాజీల భావజాలంతో ప్రభావితుడైన సాయి వర్షిత్ ఈ కుట్రకు గత ఆరు నెలలుగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మిస్సోరిలో ఉండే సాయి వర్షిత్ దాడి చేసేందుకు వర్జీనియాలో టక్కును అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఘటన సమయంలో ట్రక్కులో ఓ పుస్తకం లభించగా అందులో ఈ దాడి ఎలా చేయాలని రాసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర చేయాల్సిన అవసరం సాయివర్షిత్‌కు ఏముంది. ఇంతకు ఈ ఆలోచన అతడిదేనా లేక వెనుక ఉండి అతడిని ఎవరైనా ప్రోత్సహించారా అనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. సాయి వర్షిత్ వ్యవహారం అమెరికాతో పాటు ఇండియాలోని తెలుగు రాష్ట్రాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.