రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులపై కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే

by Prasad Jukanti |
రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులపై కిషన్ రెడ్డి రియాక్షన్ ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు రూ. 5,336 కోట్లు కేటాయించడంపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. కేంద్రం నిధుల కేటాయింపు రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతం ఇస్తుందని అభిప్రాయపడ్డారు. గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. రైల్వే మౌలిక సదుపాయాల నిమిత్తం రికార్డు స్థాయిలో కేటాయింపులు చేయడం నరేంద్ర మోడీ సర్కార్ తెలంగాణ అభివృద్ధికి తిరుగులేని నిబద్ధతను ప్రదర్శించిందన్నారు. 2021-22 లో రూ.2,420 కోట్ల నుంచి 2024-25 లో రూ.5,336 కోట్లకు బడ్జెట్ కేటాయింపులు రెండింతలు రెట్టింపు చేయడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను నొక్కి చెబుతోందన్నారు. ఈ నిధుల పెంపు రాష్ట్రంలో రైల్వే నెట్ వర్క్ అభివృద్ధికి, ఆర్థిక పురోగతికి ప్రజల జీవితాలను మార్చడానికి ఉత్ప్రేరకంగా మారుతుందన్నారు.

Advertisement

Next Story