తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. వర్షాలపై వాతావరణ శాఖ కీలక సూచన

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-22 05:38:41.0  )
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. వర్షాలపై వాతావరణ శాఖ కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవి తాపానికి అధిక ఉష్ణోగ్రతలకు, ఉక్కపోతలకు ఉక్కిరిబిక్కిరైన తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరు జల్లులు కురవడంతో ఉపశమనం లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎట్టకేలకు వాతావరణం చల్లబడింది. బుధవారం పలు చోట్ల వర్షాలు కురిశాయి. అయితే గురువారం నుంచి అయిదు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇవి కురిసే తీరును బట్టి నైరుతి రుతుపవనాలు గురువారం తెలంగాణలో విస్తరించే ఛాన్స్ ఉందని వాతావారణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. అయితే ఓ వైపు వర్షాలు కురుస్తున్నా నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌లో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షాలతో జనగామ జిల్లా మల్కాపూర్ లో 8.2 వర్షపాతం నమోదైంది.

Advertisement

Next Story