- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహనదారులకు బిగ్ అలర్ట్ : నగరంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్-2004 సందర్భంగా నగరంలో పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ఈనెల 13 నుంచి 15 వరకు పరేడ్ గ్రౌండ్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. వాహనదారులు ఆ రూట్లలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. ముఖ్యంగా తివోలి క్రాస్ రోడ్డు నుంచి ఫ్లాజా ఎక్స్ రోడ్డు వరకు రోడ్డును మూసేవేయన్నారు. ట్రాఫిక్‌ను ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా అలుగడ్డబావి ఎక్స్ రోడ్స్, సంగీత్ ఎక్స్ రోడ్స్, వైఎంసీఏ ఎక్స్ రోడ్స్, ప్యాట్నీ, ఎస్‌బీహెచ్, ఫ్లాజా, సీటీవో, బ్రూక్ బాండ్, తివోలి, స్వీకార్ ఉపకార్ జంక్షన్స్, సికింద్రాబాద్ క్లబ్, తాడ్‌బన్ క్రాస్ రోడ్స్, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, బోయిన్‌పల్లి ఎక్స్ రోడ్స్, రసూల్‌పురా, బేగంపేట్, పారడైజ్ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ తెలిపారు. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను తిలకించేందకు మెట్రో రైలు సర్వీస్‌ను ఉపయోగించుకోవాలని కోరారు. పరేడ్ గ్రౌండ్‌కు వచ్చే వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలను పార్క్ చేయాలని సీపీ విశ్వప్రసాద్ వెల్లడించారు.