Rain Alert : హైదరాబాద్‌కు బిగ్ అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

by Sathputhe Rajesh |   ( Updated:2023-07-27 08:16:02.0  )
Rain Alert : హైదరాబాద్‌కు బిగ్ అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత కొన్ని రోజులుగా తెలంగాణలో భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అల్పపీడనం కారణంగా తెలంగాణకు రెడ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ ప్రకటించింది. మరో 24 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్‌కు మరోసారి భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. అధికారులంతా అలర్ట్‌గా ఉండాలని ఐఎండీ సూచనలు చేసింది. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

Advertisement

Next Story