ప్రయాణికులకు బిగ్ అలర్ట్ : ఉప్పల్ క్రాస్ రోడ్డులో బస్టాప్‌ల మార్పు

by Shiva |
ప్రయాణికులకు బిగ్ అలర్ట్ : ఉప్పల్ క్రాస్ రోడ్డులో బస్టాప్‌ల మార్పు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు నుంచి భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూర్‌, తొర్రూర్‌ వెళ్లే బస్సుల స్టాప్‌లను మార్చినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. సక్రాంతి రద్దీ నేపథ్యంలో బస్సులు ఆపే స్థలాలను మార్చినట్లు ట్విట్టర్‌లో పొందుపరిచారు. హన్మకొండ‌కు వెళ్లే బస్సులు యథావిధి అదే స్థానంలో ఆగుతాయని తెలిపారు. అదేవిధంగా యాదగిరిగుట్ట, తొర్రూర్‌ బస్టాప్‌లను లిటిల్‌ ప్లవర్‌ స్కూల్ సమీపంలోకి మార్చినట్లు ఆయన వెల్లడించారు. ఒక్కో బస్టాప్‌ను 300 మీటర్లతో గ్యాప్‌తో ఏర్పాటు చేశామని తెలిపారు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో మహిళల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. ఈ సంక్రాంతికి రెగ్యులర్‌, స్పెషల్‌ బస్సులన్ని ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు సమీపంలోని బస్టాప్‌ల నుంచే బయలుదేరుతాయని అన్నారు. ప్రయాణికులంతా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, క్షేమంగా వారివారి గమ్య స్థానాలకు చేరుకోవాలని టీఎస్‌ ఆర్టీసీ కోరుతోందని వివరించారు.

Advertisement

Next Story