బిగ్ అలర్ట్ : 2 రోజులు ప్రజాపాలన దరఖాస్తులకు బ్రేక్

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-30 07:06:00.0  )
బిగ్ అలర్ట్ : 2 రోజులు ప్రజాపాలన దరఖాస్తులకు బ్రేక్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ 2 రోజుల పాటు బంద్ కానుంది. 31(ఆదివారం), 1(సోమవారం) రెండు రోజుల పాటు దరఖాస్తులకు ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. మళ్లీ 2 వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 28న ప్రజాపాలన ఆరు గ్యారంటీల దరఖాస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరించడం ప్రారంభించింది. అయితే రెండు సెలవు దినాలు తీసేస్తే కేవలం 8 రోజులే దరఖాస్తులు స్వీకరించినట్లవుతుంది. దీంతో తెలంగాణ ప్రజలు దరఖాస్తుల గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యాంరటీల లబ్ధిదారుల ఎంపికంలో భాగంగా ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story