- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు కేసీఆర్‌తో భీమ్ ఆర్మీ చీఫ్ భేటీ
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ తో శుక్రవారం భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ భేటీ కానున్నారు. తెలంగాణలో రెండ్రోజుల పర్యటనకు వచ్చిన భీమ్ ఆర్మీ చీఫ్ నకు శుక్రవారం జాగృతి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్సీ కవితతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో దళిత సంక్షేమం, బడ్జెట్ లో కేటాయిస్తున్న నిధులు, రాజకీయ అవకాశాలపై దాదాపు గంటకు పైగా చర్చించారు. దళితబంధుపైనా ఇరువురు చర్చించారు. అనంతరం ట్యాంకు బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని, అమర జ్యోతిని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ.. దేశానికి ఆదర్శంగా కేసీఆర్ పాలన అన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి ప్రశంసనీయమన్నారు. పార్లమెంట్ నూతన భవనానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ నామకరణం చేయాలని, భవనంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దేశంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఢిల్లీ లో నిరసన తెలిపినప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ప్రకటించారని తెలిపారు. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. మణిపూర్ ఘటన దేశంలో అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏ మహిళకు కూడా ఇది జరగకూడదన్నారు. కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మణిపూర్ ఘటనకు కేంద్రం జవాబుచెప్పాలన్నారు.
వెనుకబడిన వర్గాల కోసం ఆజాద్ చేస్తున్న పోరాటానికి అండ ఉంటామని, పోరాటాల్లో కలిసి వస్తామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. పార్లమెంట్ నూతన భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని చేస్తున్న డిమాండ్ కు తెలంగాణ ప్రజల మద్దతు ఉంటుందన్నారు. దేశంలో అందరూ చరిత్రను మరిపించే ప్రయత్నం చేస్తుంటే, తెలంగాణలో చరిత్రను శాశ్వతంగా ఉంచేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన కేసీఆర్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారన్నారు. ఆజాద్ వంటి భావసారూప్యత కలిగిన వారితో బీఆర్ఎస్ కలిసి నడుస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, బీసీ కమిషన్ సభ్యుడు కె.కిశోర్ గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు పల్లె రవికుమార్ గౌడ్, రాజీవ్ సాగర్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, వాసుదేవ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయగౌడ్, జి.నగేష్, రాంచందర్ నాయక్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మాజీ మేయర్ ఫసీయుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.