- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bhavishya Vaani: వైభవంగా ముగిసిన మహంకాళి బోనాల జాతర.. మాతంగి చెప్పిన భవిష్యవాణి ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ మహంకాళి బోనాలు వైభవోపేతంగా ముగిశాయి. ఈ సందర్భంగా మంగళవారం మాతంగి స్వర్ణలత పచ్చి కుండపై నిలబడి శివమెత్తి భవిష్యవాణి చెప్పారు. అయితే, భవిష్యత్తులో జరిగే విషయాలు తెలుసుకునేందుకు భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. మాతంగి స్వర్ణలతను పూనిన అమ్మవారు పలు ఆసక్తిర విషయాలను వెల్లడించింది. భక్తులు చేసిన పూజల పట్ల తాను సంతోషం వ్యక్తం చేసినట్లు అమ్మవారు తెలిపింది. ఈ ఏడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పింది. సంవృద్ధిగా పంటలు పండుతాయని అందులో ఎవరూ ఎలాంటి అనుమాలు పెట్టుకోద్దని తెలిపింది. మట్టి కుండలో బోనం అయినా.. బంగారు బోనం అయినా తనకు సమ్మతమేనని అమ్మవారు పలికింది. చిన్న పిల్లలు, గర్భిణులు, ముసలివాళ్లకు ఎలాంటి ఆపద రానివ్వబోనని మాతంగి స్వర్ణలతను పూనిన అమ్మవారు ఉద్భోదించింది. ఈ రంగం కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.