Bhatti: క్రోని క్యాపిటలిస్టుల నుంచి రక్షించండి.. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భట్టి

by Ramesh Goud |   ( Updated:2024-11-10 14:01:40.0  )
Bhatti: క్రోని క్యాపిటలిస్టుల నుంచి రక్షించండి.. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భట్టి
X

దిశ, వెబ్ డెస్క్: క్రోని క్యాపిటలిస్టుల(Crony Capitalists) నుంచి జార్ఖండ్‌(Jharkhand)ను రక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Telangana Deputy Chief Minister Bhatti Vikramarka) పిలుపునిచ్చారు. జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్(Star Campaigner) గా ఉన్న భట్టి.. ఇవాళ రాంఘర్ నియోజకవర్గం(Ranghar Constituency)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాట్లాడుతూ.. ఇండియా కూటమి(India Alliance) అభ్యర్థులకు ఓటు వేసి, క్రోనీ క్యాపిటలిస్ట్‌ల నుంచి జార్ఖండ్‌ను రక్షించాలని ప్రజలను కోరారు. అలాగే కూటమి నాయకులను భారీ మెజరిటీతో గెలిపించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. రాహుల్‌ గాంధీ జోడో యాత్రతో దేశంలో ప్రజాస్వామ్య శక్తులను ఏకం చేశారని అన్నారు. ఇక జార్ఖండ్‌ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఏఐసీసీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. కాగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు కోసం కాంగ్రెస్ అధిష్టానం స్టార్ క్యాంపెయినర్ లను నియమించింది. ఇందులో భాగంగానే జార్ఖండ్ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా డిప్యూటీ సీఎం భట్టిని నియమించింది.

Advertisement

Next Story