- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bhatti: కలెక్టర్లు, ఎన్యుమరేటర్ల కో ఆర్డినేట్ అవసరం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
దిశ, తెలంగాణ బ్యూరో: అన్ని జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఎన్యుమరేటర్లను కో ఆర్డినేట్ చేస్తుండాలని, సర్వే ప్రాసెస్ స్టేటస్ ను పరిశీలిస్తూ ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై ఆయన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..ఇంటింటి సర్వే లో ప్రజల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని, కలెక్టర్లు వాటిని అవగాహన కల్పించేలా ఆదేశాలివ్వాలన్నారు. ప్రజల అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువ సార్లు సర్వేలో భాగస్వాములు అయ్యేలా చూడాలని అధికారులను కోరారు. సమగ్ర కుటుంబ సర్వే చాలా పెద్ద కార్యక్రమం అని, ఇలాంటి కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని సూచించారు. క్వశ్చనీర్ పకడ్బందీగా రూపొందించారని, ఎనిమరేటర్లకు బాగా శిక్షణ ఇచ్చారని ఆయన అధికారులను అభినందించారు.
హౌస్ లిస్ట్ కూడా విజయవంతంగా పూర్తి చేశారని, ఇదే రీతిలో కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. మన చూపే నిబద్ధతపైనే ఈ సర్వే విజయవంతం కావడం ముఖ్యమని స్పష్టం చేశారు. యావత్ దేశం తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న కుటుంబ సర్వేను గమనిస్తుందని వివరించారు. ఈ దేశంలో ప్రగతిశీల భావాలను, కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి ఈ సర్వే గొప్పగా ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ప్రతి చిన్న విషయం కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్న అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు. సర్వేపై కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిలోని అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రధానంగా పట్టణాలపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎంతో రైతు కమిషన్ చైర్మన్ సమావేశం
రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తో సమావేశం అయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన సమావేశంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి తో పాటు భూమి సునీల్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ధరణి సమస్యలు, ప్రతిపాదన దశలో ఉన్న కొత్త రెవెన్యూ రికవరీ చట్టం గురించి కోదండ రెడ్డి డిప్యూటీ సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో భూసంస్కరణ చట్టం, అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం, ధరణిలోని పార్ట్-a, పార్ట్-b లోని భూముల వివరాల గురించి చర్చించారు.