ఖర్గే తో భట్టి, పొంగులేటి భేటీ.. ఆకస్తిగా మారిన ఖమ్మం అభ్యర్థి ఎంపిక

by Prasad Jukanti |
ఖర్గే తో భట్టి, పొంగులేటి భేటీ.. ఆకస్తిగా మారిన ఖమ్మం అభ్యర్థి ఎంపిక
X

దిశ, డైనమిక్ బ్యూరో:టీ కాంగ్రెస్ లో ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక్కడ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ భేటీ అయ్యారు. వీరిని పార్టీ అధిష్టానం బెంగళూరు పిలిపించింది. దీంతో భట్టి, పొంగులేటి బెంగళూరు వెళ్లి ఖర్గేతో వేర్వేరుగా చర్చలు జరిపారు. ఖమ్మం టికెట్ రేస్ లో భట్టి విక్రమార్క సతీమణి, పొంగులేటి సోదరుడు ఉన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే తమ వారికి టికెట్ ఇవ్వలేని పక్షంలో తాము సూచించిన వారికి టికెట్ కేటాయించాలని ఇరువురు పార్టీ అధ్యక్షుడి వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కాగా ఖమ్మంతో పాటు కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నెల 25తో నామినేషన్ల గడువు ముగియనుండటంతో ఇవాళ లేదా రేపటి లోపు పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించవచ్చని నాయకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story