Bairi Naresh: అయ్యప్య స్వామిపై అనుచిత వ్యాఖ్యలు.. పరిగెత్తించుకుంటూ కొట్టిన స్వాములు

by Satheesh |   ( Updated:2022-12-30 10:25:20.0  )
Bairi Naresh: అయ్యప్య స్వామిపై అనుచిత వ్యాఖ్యలు.. పరిగెత్తించుకుంటూ కొట్టిన స్వాములు
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు రోజుల క్రితం అయప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ అనే వ్యక్తిపై కోస్గిలో అయప్ప మాలధారులు దాడి చేశారు. అయప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్వాములు నరేష్‌ను పరిగెత్తించుకుంటూ కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్వాములను అడ్డుకుని.. భైరి నరేష్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, రెండు రోజుల క్రితం అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. మాలధారులు అతడికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. నరేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story