- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రైవేటు సంస్థకే.. భద్రాచలం నెయ్యి కాంట్రాక్టు
దిశ, వెబ్ డెస్క్: భద్రాచల (Bhadrachalam) సీతారాముల దేవాలయంలోని లడ్డు, ఇతర ప్రసాదాల తయారీలో వాడే నెయ్యిని (ghee) దేవాలయ శాఖ ఓ ప్రైవేటు సంస్థ (private company) అయిన రైతు డెయిరీకే (Farmer's Dairy) అప్పగించింది. ఇప్పటికే ప్రభుత్వం విజయ డెయిరీ (Vijaya Dairy) నుంచి నెయ్యిని కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆలయ అధికారులు ప్రభుత్వ ఆదేశాలు పక్కన పెట్టి ప్రైవేట్ సంస్థకు నెయ్యి కాంట్రాక్ట్ (contract) ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. టీటీడీ లడ్డూల తయారీలో వాడే నెయ్యి, టెండర్ల (tenders) విషయం వివాదంగా మారడంతో ఆలయంకు ఇక నుంచి ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ నుంచి నెయ్యి తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు ఆగస్టు 22న దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ (Shailaja Ramayer) ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా భద్రాచల ఆలయ ఈఓ కార్యాలయం ఆగస్టు 28న రైతు డెయిరీకి నెయ్యి సరఫరా ఆర్డర్‌ను జారీచేసింది.
భద్రాచల (Bhadrachalam) ఆలయ నెయ్యి కాంట్రాక్టు గడువు ముగిసిపోవడంతో జూన్ లో అధికారులు నెయ్యి సరఫరాకు ఈ-టెండర్లుకు పిలిచారు. ఈ టెండర్లకు కరీంనగర్ (Karimnagar) డెయిరీతో పాటు ఏపీ లోని జంగారెడ్డి గూడెం సమీపంలోని 'రైతు డెయిరీలు పాల్గొన్నాయి. ఈ సంస్థలు కిలో నెయ్యికి కరీంనగర్ డెయిరీ జీఎస్టీతో కలిపి రూ.610 కోడ్ చేయగా, రైతు డెయిరీ రూ.534.24 కోడ్ చేశాయి. దీంట్లో రైతు డెయిరీ ఎల్- 1 గా నిలిచింది. అయితే, ప్రధాన ఆలయాలకు రెండేళ్ల పాటు నెయ్యి సరఫరా చేసిన అనుభవం, ఏడాదికి రూ. 10 కోట్ల టర్నోవరు ఉండాలన్న టెండరు నిబంధనల్లో రైతు డెయిరీ అర్హత సాధించకపోవడంతో'డిస్‌క్వాలిఫై అయ్యింది. టర్నోవరు, ప్రధాన ఆలయాలకు సరఫరా చేసే అనుభవ నిబంధనల్ని తొలగించి మళ్లీ అవే రెండు డెయిరీలు పాత ధరలే కోట్ చేశాయి. అందులో రైతు డెయిరీకే ఆ నెయ్యి కాంట్రాక్టును ఆలయ అధికారులు పట్టం కట్టారు. ప్రభుత్వ సంస్థను కాదని ప్రైవేట్ సంస్థకు అప్పజేప్పడంతో ఆలయ అధికారులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.