Krishna Vamsi: నా విజయాన్ని కృష్ణవంశీకే అంకితం చేస్తున్నాను.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్

by Hamsa |   ( Updated:2024-12-16 09:59:44.0  )
Krishna Vamsi: నా విజయాన్ని కృష్ణవంశీకే అంకితం చేస్తున్నాను.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శ్రీధర్(Raghav Omkar Sridhar) తెరకెక్కించిన చిత్రం ‘ది 100’. ఇందులో మొగలిరేకులు ఫేమ్ సాగర్(Sagar) హీరోగా నటించగా.. ఈ సినిమాకు అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుంది. ఇప్పటికే ఈ మూవీ పలు గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(Goa International Film Festival), దాదా సాహెబ్ ఫాల్కే ఫెస్టివల్, పారిస్ ఫిల్మ్ అవార్డ్స్(Paris Film Awards) ఇలా అంతర్జాతీయ వేదికపై పురస్కారాలు అందుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, రాఘవ ఈ సినిమాకు ఇంత పాపులారిటీ రావడానికి కారణం తన గురువు డైరెక్టర్ కృష్ణవంశీ అని తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘నేను దర్శకత్వం వహించిన తొలి చలనచిత్రం ‘ది 100’ అనేక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. అలాగే ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ దాని ప్రభావవంతమైన అంశాలను, సానుకూలమైన పాత్రల గురించి ఎంతో మెచ్చుకున్నారు. ఇంత అర్ధవంతమైన కథను రూపొందించడం, దాని పాత్రలను సృష్టించడం వెనుక పూర్తిగా నా గురువుగారు కృష్ణవంశీ(Krishna Vamsi) ఉన్నారు.

ఆయన నుంచి నేను నేర్చుకున్న విలువలు, కథన పద్ధతులు ఈ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాయి. ఈ విజయాన్ని 100% నా గురువు గారికి అంకితం చేస్తున్నాను. త్వరలోనే ఈ చిత్రాన్ని మీ అందరి ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ దీవెనలు, మద్దతు మా టీమ్ మొత్తానికి ఉండాలని కోరుకుంటున్నా. నాకు మార్గదర్శకంగా నిలిచినందుకు కృష్ణ వంశీ(Krishna Vamsi)కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed