- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదలకు మెరుగైన వైద్యసేవలందించాలి: మంత్రి హరీష్ రావు
దిశ, కాప్రా: పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ ముందుండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం కుషాయిగూడ లో డాక్టర్ అన్వేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్ సీడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బండారి లక్ష్మారెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రైవేట్ హాస్పిటల్స్ కేవలం వ్యాపారపరంగా కాకుండా పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా సేవలందించాలని, అప్పుడే వైద్య వృత్తి పట్ల నమ్మకం పెరుగుతుందన్నారు.
కుషాయిగూడ పరిధిలో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేయడం హర్షనీయమని అన్నారు. ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని నిర్వాహకులను కోరారు. డాక్టర్లు ప్రజలకు చేసే వైద్యాన్ని సేవగా భావించాలన్నారు. హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అన్వేష్ మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన వైద్యంతో పాటు అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూసుకుంటామని తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో 60 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ కార్డు దారులకు, రిటైర్డ్ ఉద్యోగులకు 30 శాతం రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. గర్భిణులకు మొదటి మూడు నెలలు డయాగ్నసిస్, కన్సల్టెన్సీ, ఫార్మసీ సేవలలో రాయితీ కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి, శాంతి సాయి జన శేఖర్, బన్నాల గీత ప్రవీణ్, నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రా రెడ్డి, మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కాసం మహిపాల్ రెడ్డి, బన్నాల ప్రవీణ్, సాయి జన్ శేఖర్, సిపిఎం నాయకులు డిజి నర్సింగ్ రావు, చేరుపల్లి సీతారాములు జర్నలిస్టు రాష్ట్ర నాయకుడు బసవ పున్నయ్య, మేడ్చల్ జిల్లా సీపీఎం అధ్యక్షుడు సత్యం తదితరులు పాల్గొన్నారు.
Also Read..
Kiran Kumar Reddy : మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్