- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబుల్ బెడ్రూం ఇండ్ల ఎంపికలో గోల్ మాల్
దిశ, మంచిర్యాల టౌన్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వేంపల్లి గ్రామంలో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో రాజీవ్ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అద్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న 330 డబల్ బెడ్రూం ఇండ్ల ఎంపికకు 3 వేల పైచిలుకు అప్లికేషన్స్ రాగా 1616 మందిని అర్హులుగా గుర్తించి 330 మందికి లక్కీ డ్రా లో ఇండ్లను అప్పగించారు.
అందులో కొందరు తమకు అన్యాయం జరిగిందంటూ ఆందోళనకు దిగారు. సొంత ఇండ్లు ఉన్న చాలా మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చాయని, ఎన్నో ఏండ్లుగా కిరాయికి ఉంటున్న తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. వికలాంగులు, బీసీ, ఎస్సీ, మైనారిటీ అంటు రిజర్వేషన్ల ప్రకారం డ్రా తీయడం ఏంటని ప్రశ్నించారు. కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ రాజు, ఆర్డీవో వేణు, ఎమార్వో, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.