- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Beerla Ilaiah: బీజేపీ నేతలవి దొంగ నిద్రలు.. విప్ బీర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మూసీ (Musi) పరీవాహక బస్తీల్లో ఒకరోజు నిద్రించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన సవాలును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) స్వీకరించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు మూసీ (Musi) పరీవాహక ప్రాంతాల్లోని సుమారు 20 బస్తీల్లో బీజేపీ (BJP) ముఖ్య నేతలు బస్తీవాసులతో కలిసి అక్కడే నిద్రించారు. అదేవిధంగా అంబర్‌పేట్ (Amberpet) నియోజకవర్గ పరిధిలోని తులసీరామ్ నగర్ (Tualsiram Nagar)లో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి (Kishan Reddy), మలక్‌పేట్‌లో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman), ఎల్‌బీ నగర్‌లో ఈటల రాజేందర్ (Etala Rajender), హైదర్ షా కోట్‌లో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి (Vishweshwar Reddy), కార్వాన్‌లో సీతారాం నాయక్ (Seethram Nayak), రామాంతపూర్‌లో ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. పేదలు ఇళ్లను కూల్చకుడా మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే బీజేపీ (BJP) బస్తీ నిద్రపై ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ (BJP) నేతలు దొంగ నిద్రలు చేస్తున్నారని ఆరోపించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP)లు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. వికారాబాద్ Vikarabad), నల్గొండ (Nalgonda), హైదరాబాద్ (Hyderabad) ప్రజలు మూసీ కంపులోనే బ్రతకాల అంటూ ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్కరోజు నిద్ర కాదు.. 3 నెలల పాటు అక్కడే ఉండాలని బీర్ల ఐలయ్య సవాల్ విసిరారు.