యాదాద్రి ప్రారంభోత్సవంలో అపశృతి.. మంత్రిపై తేనెటీగల దాడి

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-28 13:04:06.0  )
యాదాద్రి ప్రారంభోత్సవంలో అపశృతి.. మంత్రిపై తేనెటీగల దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా అపశృతి చేటుచేసుకుంది. పశ్చిమ రాజగోపురం (సప్తతల గోపురం) దగ్గర కలశాలకు పూజ చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడిచేశాయి. ఈ దాడిలో మంత్రి పువ్వాడకు గాయాలయ్యాయి. అర్చకులు వేదమంత్రాలు పఠిస్తుండగానే ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకోవడంతో హడావిడిగా మంత్రి కిందకు దిగడం సాధ్యం కాలేదు. తేనెతీగల దాడిలో గాయపడిన మంత్రి పువ్వాడను హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు.



Advertisement

Next Story