- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
క్రికెట్ అభిమానులారా జాగ్రత్త.. క్లిక్ చేస్తే మీ జేబులు గుల్ల!.. సజ్జనార్ ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ టికెట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారని, క్రికెట్ల అభిమానులు జాగ్రత్తగా ఉండాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. సైబర్ నేరాగాళ్లు ఐపీఎల్ టికెట్లు కావాలా? అని సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు పోస్టు చేస్తున్నారని హెచ్చరిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. క్రికెట్ అభిమానులారా.. జాగ్రత్త! ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ -రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఉన్నాయంటూ ఇన్‌స్టాగ్రామ్ లో ఫేక్ రీల్స్, స్టోరీలు చక్కర్లు కొడుతున్నాయి అన్నారు. ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ కి విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో టికెట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారని, ఇలాంటి పోస్టుల పట్ల క్రికెట్ అభిమానులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ లింక్‌లపై అసలే క్లిక్ చేయొద్దని, క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే మీ బ్యాంకు ఖాతాల్లోని నగదు గుల్లవుతుంది.. జాగ్రత్త! అని క్రికెట్ అభిమానులను హెచ్చరించారు.
క్రికెట్ అభిమానులారా.. జాగ్రత్త! ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే #IPL మ్యాచ్ టికెట్లు ఉన్నాయంటూ #Instagram లో ఫేక్ రీల్స్, స్టోరీలు చక్కర్లు కొడుతున్నాయి. #SRHvsRCB మ్యాచ్ కి విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో టికెట్ల పేరుతో సైబర్… pic.twitter.com/TWN9uxEFBA
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) April 25, 2024