Bathukamma Celebrations 2024 : తెలంగాణలో వైభవంగా బతుకమ్మ సంబురాలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-10 12:56:20.0  )
Bathukamma Celebrations 2024 : తెలంగాణలో వైభవంగా బతుకమ్మ సంబురాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ(Bathukamma) సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం చివరి రోజు కావడంతో ప్రతీ గల్లీ మైకులతో మోత మోగిపోతోంది. మహిళలు, యువతులు, చిన్నారుల ఆటాపాటలతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. ఈనెల 2న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఉత్సవాలు సద్దుల బతుకమ్మతో నేడు ముగుస్తున్నాయి. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందున ముగింపు వేడుకలను ట్యాంక్‌బండ్‌పై ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

వేల మందితో ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ వేడుకలను ప్లాన్ చేశారు. ప్రపంచంలోనే ప్రత్యేకంగా పూలను పూజించే గొప్ప సంస్కృతికి తెలంగాణ నెలవుగా ఉన్నదని పేర్కొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తీరొక్క పూలతో జరుపుకునే సంబురాలు జరుపుకునే మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మల నిమజ్జనానికి స్థానికంగా ఉన్న చెరువులతో పాటు ట్యాంక్‌బండ్ దగ్గర అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రాజ్‌భవన్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సతీమణి సుధాదేవ్ పాల్గొన్నారు. గవర్నర్‌గా నియమితులైన తర్వాత పస్ట్ టైమ్ ఈ సంబురాలను జరుపుకుంటుండడంతో పూల పండుగ విశిష్టతను అధికారులు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed