TS Political News:కాంగ్రెస్ ప్రభుత్వం పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..

by Indraja |
TS Political News:కాంగ్రెస్ ప్రభుత్వం పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం లోకి వచ్చిన విషయం అందరికి సుపరిచితమే. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చినప్పటి నుండి అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి BRS పార్టీకి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాగా ఈ రోజు BRS పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సినీ నిర్మాత బండ్ల గణేష్ ఓ వీడియో ని X లో విడుదల చేశారు.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. కనుక తెలంగాణ ముఖ్యమంత్రి పోస్ట్ ప్రస్తుతం ఖాళీగా లేదని పేర్కొన్నారు. ఎన్నికలు రావడానికి ఇంకో 5 ఏళ్ళు పడుతుందని.. మళ్ళీ ఎన్నికలు వచ్చిన ఇంకో 10 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని అందులో అతనికి ఎలాంటి డౌట్ లేదని ధీమా వ్యక్తం చేశారు. ఇక మీకు అంతగా ముఖ్యమంత్రి కావాలని.. అర్జెంటు గా పదవి చేపట్టాలని.. రాష్ట్రాన్ని అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని అనుకుంటే వేరే రాష్ట్రానికి వెళ్లాల్సిందిగా కేసీఆర్ కి సూచించారు.

ఇక BRS అంటే భారతీయ రాష్ట్ర సమితి కనుక వేరే రాష్ట్రంలో పార్టీని డెవలప్ చేసుకోమంటూ కేసీఆర్ ని ఎద్దేవ చేస్తున్న వీడియోని X లో విడుదల చేశారు. ఆ వీడియో చూసిన నెటిజన్స్ బండ్ల గణేష్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నేతల ఫోటోలు పెట్టి వీళ్ళ గురించి తెలిసే మాట్లాడుతున్నావా..? అని ఒకరు కామెంట్ పెట్టగా మరొకరు మీ గుంపు మేస్త్రి గురించి తరువాత మాట్లాడుదువుగాని ముందు నీ చెక్ బౌన్స్ కేసు గురించి ఆలోచించు బ్రో..కర్ అని కామెంట్ చేశారు. ఇక బ్లూ కమెడియన్ అని, అసలు నీకేం సంబంధం ఉందని రకరకాల కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.

Advertisement

Next Story