మీరే ఫోన్ చేసి కనుక్కోండి.. T-బీజేపీ అధ్యక్షుడి మార్పుపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
మీరే ఫోన్ చేసి కనుక్కోండి.. T-బీజేపీ అధ్యక్షుడి మార్పుపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వార్తలపై స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు వార్తలన్నీ ఊహాగానాలే అని కొట్టి పారేశారు. అదంతా తప్పుడు ప్రచారమని ఆయన ఖండించారు. బీజేపీ అధ్యక్షుడి మార్పు అంటూ వస్తోన్న వార్తలన్నీ అధికార బీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న కుట్రలో భాగం అని ఆరోపించారు.

సీఎం కేసీఆర్ సొంత పార్టీని చూసుకోకుండా పక్క పార్టీలో పొగ పెడుతున్నాడని బండి మండిపడ్డారు. అంతేకాకుండా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మార్పు అంటూ జరుగుతోన్న ప్రచారం గురించి తనకు కూడా తెలియదని.. కావాలంటే అధ్యక్షుడి మార్పు విషయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను అడిగి చెబుతానని.. లేదంటే నడ్డాకు ఫోన్ చేసి మీరే కనుక్కోండి అంటూ బండి కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చుతారంటూ గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అధ్యక్ష బాధ్యతలను బండిని తప్పించి మరో వ్యక్తికి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తెలంగాణ బీజేపీ బాధ్యతలు అప్పగిస్తారని.. మరో వైపు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడి బండి సంజయ్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుని ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని రాజకీయ వర్గా్ల్లో జోరుగా ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో బండి చేసిన తాజా కామెంట్స్‌తో.. పార్టీ అధ్యక్షుడి మార్పుపై వార్తలకు చెక్ పడింది.

Advertisement

Next Story