- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్ అహాన్ని అణిచింది బీజేపీనే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఎనిమిదేళ్ళుగా పంటలకు నష్టం వాటిల్లుతున్నా ఏనాడూ రైతులకు పరిహారం చెల్లించని కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌజ్ వదిలి పొలం బాట పట్టారని, ఆయన అహాన్ని బీజేపీ అణచేయడంతోనే ఇది సాధ్యమైందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంల అమలు చేయకుండా తొక్కిపెట్టిన కేసీఆర్ సొంతంగా రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దిష్టమైన పాలసీని రూపొందించలేదని ఆరోపించారు. గతంలో ఏనాడూ రైతులను పలకరించని కేసీఆర్ ఇప్పుడు ఎకరానికి రూ. 10 వేల చొప్పున నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారని, గతంలో ఇలాంటి ప్రకటనలు చేసినా ఆచరణకు నోచుకోలేదని ఒక పత్రికా ప్రకటనలో కామెంట్ చేశారు.
కేసీఆర్ తన సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి కేంద్రాన్ని తిట్టడం మొదలుపెట్టారని బండి సంజయ్ ఆరోపించారు. ఫసల్ బీమా యోజన అమలైతే రైతులకు లాభం కలిగి ఆ మంచి పేరు కేంద్ర ప్రభుత్వానికి పోతుందన్న రాజకీయ దురుద్దేశంతోనే అమలు చేయడం లేదని ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం ఎన్నికలు రానుండడంతో ప్రగతిభవన్‌ను, ఫామ్ హౌజ్‌ను వదిలి రైతులను పలకరించడానికి పొలం బాట బట్టి ఎనలేని ప్రేమను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులకు ఒక్కో ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందిస్తామని కేసీఆర్ ప్రకటించడం కంటి తుడుపు చర్యేనని అన్నారు. ఈ సాయం రైతులకు ఏ మూలకూ సరిపోదన్నారు. అయినా ఇదే గొప్ప సాయమంటూ చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా అంటూ పత్రికలు, టీవీలలో వార్తలు వస్తున్నాయని, రైతు సంఘాల నేతలు సైతం దీన్ని ధ్రువీకరిస్తున్నారని సంజయ్ గుర్తుచేశారు. కానీ వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే పంట నష్టాన్ని 2.28 లక్షల ఎకరాలు అనే నిర్ధారణకు వచ్చిందని, ఇది తప్పుడు విధానమన్నారు. రైతు సంఘాల విజ్ఞప్తులను స్వీకరించే ప్రయత్నం చేయకుండా గృహ నిర్బంధాలకే పరిమితం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. పంట నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటిదాకా కనీసం నివేదిక కూడా పంపలేదని, కేంద్రాన్ని అడగడమే దండగంటూ బదనాం చేయడం సిగ్గుచేటన్నారు. ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తే రైతులకు పరిహారం అందే అవకాశం ఉన్నదన్నారు. ప్రతిసారీ తన చేతగానితనాన్ని కేంద్రంపై నెట్టి తప్పించుకోవాలనుకుంటున్నారని, ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా ఆయన మర్చిపోతున్నారని అన్నారు. రైతుల పక్షాన పోరాడాల్సిన కమ్యూనిస్టు పార్టీలు అధికార పార్టీకి భజన చేయడం విచారకరమన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రగతి భవన్, ఫాంహౌజ్‌కే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారాన్ని అణిచివేసి ధర్నా చౌక్‌కు, రైతుల వద్దకు తీసుకురాగలగడం బీజేపీ పోరాట ఫలితమేనని అన్నారు.