- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bandi Sanjay : కేటీఆర్ కాస్కో.. నీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు.. లీగల్ నోటీసులపై బండి సంజయ్
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కేటీఆర్ పంపిన లీగన్ నోటీసులకు భయపడేది లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ నాకు లీగల్ నోటీసులు పంపినట్లు మీడియా కథనాల్లో చూశాను. లీగల్ నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీసు ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందన్నారు. తొలుత నాపై వ్యక్తిగత ఆరోపణలు చేసి ఆరోపించింది కేటీఆరేనని అందుకు బదులుగా నేను మాట్లాడానన్నారు. కేటీఆర్ సుద్దపూస అనుకుంటున్నాడేమో ఆయన బాగోతం అంతా ప్రజలకు తెలుసన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారం లో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసన్నారు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదిలిచ్చానని లీగల్ ఇక నోటీసులకు నోటీసులతోనే జవాబిస్తానని కాచుకోవాలన్నారు.
కాగా ఇటీవల ప్రెస్ మీట్ లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని, తనను అప్రతిష్ఠపాలు చేసేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్ కు తాజాగా కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, రేవంత్ తో కలిసిపోయానన్న వ్యాఖ్యలను నిరూపించాలన్నారు. లేదంటే వారం రోజుల్లో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డెడ్ లైన్ విధించారు.
Read More: బండి సంజయ్ కు KTR లీగల్ నోటీసులు