విచారణకు వస్తా.. రాష్ట్ర మహిళా కమిషన్‌కు బండి సంజయ్ లేఖ

by GSrikanth |   ( Updated:2023-03-14 08:46:25.0  )
విచారణకు వస్తా.. రాష్ట్ర మహిళా కమిషన్‌కు బండి సంజయ్ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర మహిళా కమిషన్‌ ఎదుట ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరవుతానని మంగళవారం బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ లేఖ రాశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ని రాష్ట్ర మహిళా కమిషన్ విచారణకు హాజరుకావాలని సోమవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 15వ తేదీన(రేపు) ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో మహిళా కమిషన్ ఆదేశించింది. ఈ నోటీసులకు బండి సంజయ్ సమాధానం పంపారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఈ నెల15న విచారణకు రాలేనని 18వ తేదీన విచారణకు హాజరవుతానని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story