Bandi Sanjay: బీఆర్ఎస్ విలీనంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   ( Updated:2024-08-19 06:34:41.0  )
Bandi Sanjay: బీఆర్ఎస్ విలీనంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు న్యాయం చేశామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎంత మంది రైతులకు రుణమాఫీ జరిగింది? ఇంకా ఎంత మందికి కావాల్సి ఉంది? వివరాలు బయట పెట్టాలన్నారు. నిజంగా రుణ మాఫీ చేస్తే రైతులు ఎందుకు రోడ్డు మీదకు వస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. ఆ అవసరం కాంగ్రెస్ కే ఉందన్నారు. రేవంత్ రెడ్డి ఏబీవీపీ నుంచి వచ్చారు కాబట్టి బీజేపీలోకి పోతారని కేటీఆర్ అంటున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చారు.. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తున్నారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రెండూ అవినీతి, కుటుంబ పార్టీలు అని విమర్శించారు. ఈ రెండు పార్టీలు తప్పక కలుస్తాయన్నారు. లేకుంటే ఈపాటికి కేసీఆర్ ను జైల్లో వేయాలి కదా అని ప్రశ్నించారు. ఇరు పార్టీల మధ్య ఇచ్చుపుచ్చుకునే విషయంలో మాట ముచ్చట అంతా పూర్తయిందని ఇక చేరికలు మాత్రమే మిగిలాయని ఆరోపించారు. అందువల్లే ఫోన్ ట్యాపింగ్ కేసు అటక్కెక్కింది, కాళేశ్వరం అడ్రస్ లేకుండా పోయింది, డ్రగ్స్ కేసు సైలెంట్ అయింది, ల్యాండ్, సాండ్ స్కామ్ లన్ని మరుగున పడ్డాయన్నారు. ఓ మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయం అన్నారు.

Advertisement

Next Story

Most Viewed