Bandi Sanjay యాత్ర : భైంసాలో హై టెన్షన్..

by Sathputhe Rajesh |   ( Updated:2022-11-28 10:54:45.0  )
Bandi Sanjay యాత్ర : భైంసాలో హై టెన్షన్..
X

దిశ, భైంసా : బీజేపీ స్టేట్ చీఫ్ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ సభ నిర్వహించే స్తలి వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేసి పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. భైంసా ఎఎస్పీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో సభా వేదిక వద్ద పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించారు. దీంతో సభ స్థలి వద్ద హై టెన్షన్ నెలకొంది. ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసుల అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బహిరంగ సభ, యాత్రకు ప్రభుత్వం అనుమతులు నిరాకరించడంతో ఆదివారం రాత్రి ముధోల్ నియజకవర్గ బీజేపీ నాయకులతో పాటు పలువురు కార్యకర్తలను అరెస్టుచేసి కుంటాల, బాసర పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో అరెస్టులను అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొంతమేర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆపై అరెస్టుచేసి ఠాణాలకు తరలించారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన బీజేపీ నాయకులు ఏది ఏమైనా బహిరంగ సభతో పాటు ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించి తీరతామని తేల్చి చెబుతున్నారు. ఎన్ని అరెస్టులు చేసిన తమను అడ్డుకునే దమ్ము కేసీఆర్‌కు లేదన్నారు. బండి సంజయ్ అరెస్ట్, బీజేపీ శ్రేణుల ఆందోళనలతో భైంసాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Read more:

1.MLA Purchase Case: ఎమ్మెల్యేలకు ఎర కేసు: దూకుడు పెంచిన సిట్

Advertisement

Next Story