- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గొప్ప మనసు చాటుకున్న బండి సంజయ్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గొప్ప మనసు చాటుకున్నారు. నిర్మల్ జిల్లాలో తల్లి అంత్యక్రియల కోసం చిన్నారి దుర్గ భిక్షాటన చేసిన వార్తలపై స్పందించారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే రామారావుకు ఫోన్ చేశారు. చిన్నారి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు అండగా ఉంటానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. మరోవైపు చిన్నారికి ఆర్థిక సాయంతో పాటు వసతి కల్పిస్తామని ఎమ్మెల్యే రామారావు భరోసా ఇచ్చారు. అనంతరం కేటీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చిన్నారి వద్దకు వెళ్లి విరాళాలు అందజేశారు.
నిర్మల్ తానూర్ మండలం బేళ్తరోడ గ్రామానికి చెందిన దుర్గ వయసు 11 సంవత్సరాలు. కొన్ని నెలల క్రితం ఆమె తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. ఇప్పుడు తల్లి గంగామణి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆ చిన్నారికి ఉన్న ఒకే ఒక్క ఆధారమైన తల్లి కూడా చనిపోవడంతో పాప ఒంటరిగా మిగిలింది. తల్లి అంత్యక్రియలకు సాయం చేసేందుకు అయిన వాళ్లు అంటూ ఎవరూ లేరు. దీంతో చేసేదేం లేక తల్లి అంత్యక్రియల కోసం చిన్నారి భిక్షాటన చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రముఖులు స్పందించారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ స్పందించి చిన్నారి బాధ్యతలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.