ఢిల్లీకి బండి సంజయ్.. ఈటల వెళ్లి రాగానే వెళ్లడంతో కొత్త చర్చ!

by Satheesh |   ( Updated:2023-05-19 15:47:18.0  )
ఢిల్లీకి బండి సంజయ్.. ఈటల వెళ్లి రాగానే వెళ్లడంతో కొత్త చర్చ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం ఢిల్లీకి పయనమయ్యారు. కాగా ఆయన ట్రీట్మెంట్ కోసమే హస్తినకు వెళ్ళారని సన్నిహితులు చెబుతున్నారు. కాగా ఇటీవల ఈటల రాజేందర్‌తో పాటు పలువురు బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన అనంతరం సంజయ్ పర్యటన బీజేపీలో చర్చకు దారితీసింది. ట్రీట్మెంట్ కోసం వెళ్లినా అన్నీ ముగిశాక బీజేపీ అగ్రనేతలను బండి సంజయ్ కలిసే అవకాశాలు ఉన్నాయి.

బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తి దృష్టి ఇప్పుడు తెలంగాణపైనే ఉంది. కర్ణాటక ఎన్నికల అనంతరం ఢిల్లీ పెద్దలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ టూర్‌లో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయోనని పలువురు చర్చించుకుంటున్నారు. తెలంగాణపై ఎలాంటి వ్యూహ రచన చేయనున్నారు అనేది ఉత్కంఠగా మారింది.

ఇవి కూడా చదవండి:

BRS ఎమ్మెల్యేల్లో తీవ్ర అసహనం.. అభివృద్ధి అంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మాత్రమేనా..?

Advertisement

Next Story