- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దేవీ థియేటర్‌లో బలగం సినిమా చూస్తున్న బండి సంజయ్ (వీడియో)

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని దేవీ థియేటర్‌లో బలగం సినిమా చూస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి సోమవారం మ్యాట్నీ షో సినిమాకు వెళ్లారు. కాగా, ఏ అంచనాలు లేకుండా విడుదలైన బలగం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.25 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భళా అనిపించింది. కుటుంబ బాంధవ్యాల గురించి చక్కగా వివరించిన బలగం సినిమా.. విడిపోయిన చాలా కుటుంబాలను దగ్గర చేసింది. చూసిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో బలగం సినిమాని తెరలపై ప్రదర్శించడం సరికొత్త ఆనవాయితీగా మారింది. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో ఊరంతా కలసి తెరపై సినిమా చూసేవాళ్లు. మళ్లీ ఇప్పుడు ఆ సంప్రదాయం తెచ్చిన బలగం సినిమా అందరినీ ఆకట్టుకుంది.