అడుగడుగునా.. అపూర్వ స్వాగతం.. బండి సంజయ్‌కి బీజేపీ నాయకులు, శ్రేణుల గ్రాండ్ వెల్‌కమ్

by Prasad Jukanti |
అడుగడుగునా.. అపూర్వ స్వాగతం..  బండి సంజయ్‌కి బీజేపీ నాయకులు, శ్రేణుల గ్రాండ్ వెల్‌కమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో తొలిసారి సొంత గడ్డ కరీంనగర్‌కు బయలుదేరిన బండి సంజయ్‌కు పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు అడుగడుగునా నీరాజనం పలికారు. ఇవాళ ఉదయం ఆయన జూబ్లీహిల్స్‌‌లోని తన నివాసం నుంచి బయలుదేరగా హైదరాబాద్ శివారు నుంచే అపూర్వ స్వాగతం లభించింది. ఉదయం కోహెడ మండలం శనిగరం స్టేజ్ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేంద్రమంత్రికి పెద్దఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి సంజయ్ తన కోసం తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలను పలకరిస్తూ, వారికి అభివాదం చేస్తూ కాన్వాయ్‌లో ముందుకు కదిలారు. ఈ క్రమంలో కాన్వాయ్ వెళ్తున్న రూట్‌లో ట్రాఫిక్ జామ్ అయి రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా సిద్దిపేట జిల్లా శనిగరం వద్ద బీజేపీ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్.కుమార్ కర్రసాము చేస్తూ కేంద్రమంత్రిని ఆహ్వానించడం అందరినీ ఆకట్టుకున్నది.

రోజంతా బిజీ బిజీ..

ఉదయం 8 గంటలకు హైఅడుగడుగునా.. అపూర్వ స్వాగతం.. బండి సంజయ్‌కి బీజేపీ నాయకులు, శ్రేణుల గ్రాండ్ వెల్‌కమ్దరాబాద్ - కరీంనగర్‌కు ప్రయాణమైన ఆయన ఇవాళ బిజీబిజీగా గడపనున్నారు. పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకోనున్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులతోనూ మాట్లాడనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకే మహాశక్తి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవాల్సి ఉన్నప్పటికీ అభిమానులు అడుగడుగునా స్వాగతం పలుకుతుండటంతో బండి సంజయ్ ప్రయాణం ఆలస్యంగా సాగుతోంది. కరీంనగర్ చేసుకున్నాక తొలుత మహాశక్తి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం కొండగట్టు ఆలయాన్ని, ఆ తర్వాత జగిత్యాల జిల్లా ధర్మపురిలోని లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్‌ను దర్శించుకుంటారు. అనంతరం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, సాయంత్రం సిరిసిల్లలోని మార్కండేయ దేవాలయాన్ని సందర్శిస్తారు. రాత్రి కరీంనగర్‌లోని తన ఇంటికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి రేపు నాంపల్లిలోని పార్టీ స్టేట్ కార్యాలయానికి వెళ్తారు.

Advertisement

Next Story