Bandi Sanjay: "మేలుకో బాలుడా".. కేటీఆర్ ట్వీట్‌‌కి బండి సంజయ్ ఎన్‌కౌంటర్

by Ramesh Goud |   ( Updated:2024-09-24 13:22:26.0  )
Bandi Sanjay: మేలుకో బాలుడా.. కేటీఆర్ ట్వీట్‌‌కి బండి సంజయ్ ఎన్‌కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమృత్ పథకంలో టెండర్ల విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ట్విట్టర్ వేదికగా ఒకరిపై మరోకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముందుగా బండి సంజయ్.. అమృత్ పథకంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని పలు ఆరోపణలు చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్.. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు బండి సంజయ్ మాట్లాడుతున్నారంటూ విమర్శలు చేశారు. కేటీఆర్ ట్విట్ కు రిప్లై కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. అస్తిత్వం కోసం డ్రామాలు చేస్తున్న కేటీఆర్ గారికి అంటూ.. "మేలుకో బాలుడా" ప్రజలు మీ "గోల్‌మాల్"ని కొనుగోలు చేయడం లేదని అన్నారు.

కాంగ్రెస్ మిమ్మల్ని పిలిచి, మీ ప్రదర్శనలకు అభినందనలు తెలియజేసేందుకు బిజీగా ఉన్న సమయంలో, ఇది మరో "డ్రామారావు" క్షణం మాత్రమేనని ప్రజలకు తెలుసన్నారు. ప్రియమైన “గజినీ,” మీరు గమనించలేని విధంగా కాంగ్రెస్ చుట్టూ డ్యాన్స్ చేయడంలో చాలా బిజీగా ఉన్నప్పుడు.. అమృత్ టెండర్‌లతో మీ పార్టీ “ధూమ్ మచాలే” పీఆర్ స్టంట్‌లకు చాలా కాలం కంటే ముందే బీజేపీ మాట్లాడిందని స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన స్వంత “కల్ హో నా హో” దృష్టాంతంలో కూరుకుపోయిందని, ఎటువంటి అక్రమాలు జరగలేదని వారు విశ్వసిస్తే వెంటనే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణను కోరాలని, విచారణ వేగవంతం అయ్యేలా చూస్తామని చెప్పారు. ఇక చివరగా మీ “అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ”లో బీజేపీకి అతిథి పాత్ర అవసరం లేదని, మేము ప్రజల కోసమే ఇక్కడ ఉన్నాం తప్ప ప్లాట్ ట్విస్ట్ కోసం కాదని ఎద్దేవా చేశారు.

కాగా ట్విట్టర్ లో కేటీఆర్.. ‘గౌరవనీయులైన బండి సంజయ్‌ గారు.. దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్టు ఉంది ఈ వ్యవహారం. మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అన్న విషయం మర్చిపోయినట్లు ఉన్నారు. ‘అమృత్‌’ మీ కేంద్ర పథకం. అందులో అవినీతి జరిగిందని ముందుగా చెప్పింది స్వయాన మీ పార్టీ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అయినా పాలు తాగుతున్న దొంగ పిల్లిలా కన్వీనియంట్‌గా కళ్ళు మూసుకున్నారు. ఈ వ్యవహారం మొత్తం ఆధారాలతో మేము బయట పెట్టాక ఈ చిల్లర మాటలు దేనికి? సీవీసీ స్వతంత్ర సంస్థ.. దానికి మీ సిఫార్సు దేనికి? అయినా మీ అజబ్‌ ప్రేమ్‌ కి గజబ్ కహానీ అందరూ గమనిస్తూనే ఉన్నారు.’ అని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed