- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandi Sanjay: త్యాగధనుల జయంతి సందర్భంగా కేంద్రమంత్రి ఘన నివాళులు
దిశ, డైనమిక్ బ్యూరో: జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటూ ట్విట్టర్ వేదికగా వేర్వేరు పోస్టులు పెట్టారు. ఇందులో గాంధీ జయంతి సందర్భంగా.. ప్రపంచానికి అహింస, సత్యాగ్రహాన్ని ప్రభోదించి, శాంతిమంత్రమే హక్కుల సాధనకు పోరాటమార్గమని నిరూపించిన ఘనుడని కీర్తించారు. అలాగే చేతిలోని భగవద్గీత ఈ దేశానికి ఊతమని ఉదహరించి, స్వతంత్ర భారతం కోసం ఆంగ్లేయులను ఎదురించి, భరతమాత సంకెళ్లు తెంచిన మన జాతిపిత మహాత్మా గాంధి గారికి నమస్సుమాంజలి ఘటించుకుంటూ.. ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జై జవాన్, జై కిసాన్ అంటూ దేశ దృక్కోణాన్ని మార్చిన దార్శనికుడని, ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు ఆధ్యుడని కొనియాడారు. అంతేగాక దేశం కోసం నిత్యం పరితపించిన దేశభక్తుడని, స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకున్న సమరయోధుడు, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నమస్సుమాంజలులు తెలియజేస్తున్నానని కేంద్రమంత్రి రాసుకొచ్చారు.