ఆ స్కీమ్ చాలా మంచిది: బండి సంజయ్ కితాబు

by Gantepaka Srikanth |
ఆ స్కీమ్ చాలా మంచిది: బండి సంజయ్ కితాబు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టా్త్మకంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశంసల వర్షం కురిపించారు. కావాలనే విద్యార్థులను విపక్షాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. విద్యార్థులు, యువత విపక్షాల వలలో పడొద్దని సూచించారు. ఆర్మీ జవాన్లే ఈ దేశానికి నిజమైన హీరోలు అని కొనియాడారు. అంతకుముందు బీఆర్‌ఎస్‌‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్‌ ఎన్నో అక్రమాలకు, అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం రేవంత్‌ అతన్ని జైలుకు పంపించకపోతే తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య రాజకీయ యుద్ధం తప్పదని హెచ్చరించారు. తనతో పాటు అనేక మంది బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ హయాంలో ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు.

Advertisement

Next Story