- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ వార్తలు.. కుండబద్దలు కొట్టిన బండి సంజయ్
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం మీడియా సృష్టే అని అన్నారు. ఇప్పటివరకు అలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో మీటింగ్ పెట్టుకున్నారేమో.. బీఆర్ఎస్ అంటే బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి అని అభివర్ణించారు. బీఆర్ఎస్ ఒక ఔట్ డేటెడ్ పార్టీ అని విమర్శించారు. వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అలా మాట్లాడుతున్నారని అన్నారు. వాళ్ళు ఢిల్లీ వచ్చేది కవితను కలిసేందుకు మాత్రమే అని తెలిపారు. బెయిల్ ప్రభుత్వం చేతిలో ఉంటే లా ఎందుకు? కోర్టు ఎందుకు? అని సీరియస్ అయ్యారు. కేసీఆర్‌ను లోపల వేయకుంటే కాంగ్రెస్‌కు గడ్డు కాలం తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. లోపల వేస్తారని ప్రజలు అనుకుంటున్నారు.. ఒక నెల కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఏడాది కావచ్చు.. అలా జరగకుంటే అప్పుడు ఆ రెండు పార్టీలు ఒక్కటే అని అర్థమవుతుందని అన్నారు.
అది అందరికీ తెలిశాక రెండు పార్టీలు మాపై యుధానికి వస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. వారిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలంటే యూరప్‌కు కాకుండా బంగ్లాదేశ్ పంపాలని ఎద్దేవా చేశారు. మోడీకి దేశం ముఖ్యం.. దేశ రక్షణ విషయంలో ఆయన కాంప్రమైజ్ అవ్వరు. బీఆర్ఎస్ హయాంలో కొంతమంది అధికారులు కొమ్ము కాశారు. నిజాయితీగా పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదు. కాంగ్రెస్ కూడా అదే చేసింది. ఆ రెండు పార్టీలకు తేడా లేదు.. అవి ఒకటే. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్న పార్టీ కాంగ్రెస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంజుకుంటాం. అన్ని గ్రామపంచాయతీలకు నిధులు ఇచ్చే సత్తా కాంగ్రెస్‌కు లేదు. నిధులు ఇచ్చేది మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే. ఏ పార్టీ అయినా సరే .. సర్పంచ్, ఎంపీటీసీలు, మాజీలు మాకు సపోర్ట్ ఇవ్వడం ఖాయం.
గతంలో కేటీఆర్ కూడా సూటు బూటు వేసుకుని విదేశాలు తిరిగాడు.. ఎన్ని కంపెనీలు వచ్చాయి.. ఎందరికి ఉద్యోగాలు వచ్చాయని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రస్తుతం టీ.కాంగ్రెస్‌లో లుకలుకలు మొదలయ్యాయని అన్నారు. వారు ఐదేళ్లు అధికారంలో ఉంటారా? లేదా? అనేది వారి చేతిలోనే ఉందని అన్నారు. ఎమ్ఐఎమ్ చీఫ్ అసద్ ఎన్ని వక్ఫ్ బోర్డులు కాపాడారు. ఒక గ్రామం మొత్తం వక్ఫ్ బోర్డు అంటే ఎలా? అసద్.. వారి సమాజానికి ఏం పని చేశాడు? ప్రయివేటు ప్రాపర్టీలు కూడా వక్ఫ్ కింద ఉన్నాయి. వక్ఫ్ భూములను బీఆర్ ఎస్ కబ్జా చేసింది. కొందరు ముస్లిం మత పెద్దలు కబ్జా చేసే వారికి కొమ్ము కాశారు అని అన్నారు. బీజేపీలో తాను సామాన్య కార్యకర్తను అని.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా పనిచేస్తా అని బండి సంజయ్ అన్నారు.