- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాధారణ కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు బండి, కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్ కార్పొరేటర్ స్థాయి నుంచి నేడు కేంద్ర మంత్రి కాబోతున్నారు. తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ ఓ సునామీల దూసుకొచ్చారు. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో పని చేశారు. ఏబీవీపీ, యువమోర్చలో జాతీయ స్థాయిలో కీలక పదవులు చేపట్టారు. ఎల్.కే అద్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంచార్జిగా చేశారు. తర్వాత కరీంనగర్ నగర పాలక సంస్థ గా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48 వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్ గా, రెండోసారి అదే 48వ డివిజన్ నుండి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయం సాధించారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సంజయ్‌కి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో గెలవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నగర బీజేపీ అధ్యక్షుడి నుంచి స్టేట్ బీజేపీ అధ్యక్షుడిగా చేశారు.
2020 నుంచి 2023 జూలై 3 వరకు బీజేపీ స్టేట్ చీఫ్‌గా భాద్యతలు చెప్పట్టి పార్టీ బలోపేతం కీలక రోల్ పోషించారు. 2023లో జూలై 29న జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు. తర్వాత 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024 మే లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 5,85,116 ఓట్లు సాధించి, 2,25,209 మెజారిటీతో రెండోసారి ఎంపిగా గెలిచి.. కరీంనగర్ చరిత్రలో కొత్త రికార్డు నెలకొల్పారు.
సాధారణ కార్యకర్త నుంచి కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం
తెలంగాణ బీజేపీలో కీలక నేతగా ఎంపీ కిషన్ రెడ్డి ఉన్నారు. కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో జన్మించారు. 1977లో జనతా పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. 1980లో బీజేపీ ఆవిర్భావం నుంచి వివిధ హోదాల్లో కిషన్ రెడ్డి ఆ పార్టీలో పనిచేస్తున్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా కేంద్ర మంత్రి స్థాయికి కిషన్ రెడ్డి ఎదిగారు. 2004 శాసనసభ ఎన్నికల్లో తొలిసారి ఆయన హిమాయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009 ఎన్నికల్లో అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి వరుసగా రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2010 నుంచి సుదీర్ఘకాం స్టేట్ జేజేపీ చీఫ్‌గా పనిచేశారు.
తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఆయన.. 2012లో 22 రోజుల పాటు పోరు యాత్ర చేపట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. నరేంద్ర మోడీ కేబినెట్‌లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2021లో చేపట్టిన కేబినెట్ విస్తరణలో భాగంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులకు ముందు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి.. నేడు మరోసారి కేంద్ర మంత్రిగా చేయనున్నారు.