- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీ అయ్య బార్ పెట్టుకుంటాడు.. నువ్వు మసీదు కట్టుకో.. బండి సంజయ్ ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేతలైన కేసీఆర్ బార్ పెట్టుకోవాలని, కేటీఆర్ మసీదు కట్టుకోవాలని బీజేపీ నేత బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ లో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీలు విమర్శల వర్షం గుప్పించుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్ లో ఒకరిపై మరొకరు విరుచుకుపడుతున్నారు. తన గురించి కామెంట్లు చేసిన కేటీఆర్ కి కౌంటర్ గా బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కేసీఆర్ కొడుకు కేటీఆర్ సిరిసిల్లలో తన గురించి మోరుగుతున్నాడని, తనకి బలుపు తలకి ఎక్కిందని, ఖండకావరం ఎక్కువ అయ్యిందని ధ్వజమెత్తారు. నేను హిందూ ధర్మం గురించి మాట్లాడితే.. తనని మఠం పెట్టుకొమ్మని అంటున్నాడని, మరి కేసీఆర్ నిత్యం మందు తాగుతూ ప్రజలకు అందుబాటులో లేకుండా.. ఫాంహౌజ్ లో పడుకుంటాడు.. ఆయనని బార్ పెట్టుకొని బ్రతకాలని అన్నారు. అలాగే కేటీఆర్ నువ్వు నిత్యం ముస్లింల గురించి మాట్లాడాతాడని, దేవున్ని నమ్మడని, నువ్వు మసీదు కట్టుకొని బ్రతకాలని ఫైరయ్యారు. కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలని, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని బండి సంజయ్ అన్నారు.