Bandi Sanjay: బీఆర్ఎస్‌లో హరీశ్, కేటీఆర్ పంచాయతీ నడుస్తోంది: బండి సంజయ్ హాట్ కామెంట్స్

by Shiva |   ( Updated:2024-10-29 07:56:07.0  )
Bandi Sanjay: బీఆర్ఎస్‌లో హరీశ్, కేటీఆర్ పంచాయతీ నడుస్తోంది: బండి సంజయ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao) పంచాయతీ నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) అన్నారు. ఇవాళ ఆయన విశాఖపట్నం (Vishakhapatnam)లోని వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ ఎరినా (VMRDA Childrens Arena)లో నిర్వహించిన రోజ్‌గార్ మేళా (Rosegar Mela) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ లో కేటీఆర్, హరీశ్ రావు మధ్య పంచాయతీ నడుస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.

రాష్ట్రంలో ఆర్.కే.హెఎచ్ (రేవంత్, కేటీఆర్, హరీష్‌రావు) ప్రభుత్వం నడుస్తోందని కామెంట్ చేశారు. కేటీఆర్ (KTR) బావమరిది రాజ్ పాకాల (Raj Pakala) మందు దందాలో దొరికితే.. బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) ధర్నాలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసింది కాక.. ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు దొంగ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. అసలు కేసీఆర్ (KCR) లేకపోతే.. కేటీఆర్‌(KTR)ను ఎవరూ పట్టించుకోరని అన్నారు. తాము మూసీ (Musi) ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని.. పేదలను ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్(Congress) బీఆర్ఎస్ (BRS) పార్టీలను వెంటాడి.. వేటాడి నామరూపాలు లేకుండా చేస్తామని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story