- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandi Sanjay:కవిత బెయిల్‌పై చేసిన కామెంట్స్‌కు వివరణిచ్చిన బండి సంజయ్.. హైడ్రాపై ప్రశ్నల వర్షం
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి బండి సంజయ్ కవిత బెయిల్‌పై చేసిన కామెంట్లకు తాజాగా వివరణ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాదులోని బీజేపీ ఆఫీసులో బండి మాట్లాడుతూ.. కోర్టులపై నాకు ఎంతో గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అన్నారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ.. నేను విషయం లేవనెత్తిన తర్వాత కేసులో లాయర్ ను మార్చారంటున్నారు బండి సంజయ్. అలాగే హైడ్రా కూల్చివేతలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఒక కక్షసాధింపు చర్యలా కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. అన్ని ఆక్రమణల విషయంలో ఒకేలా వ్యవహరించడం లేదని అన్నారు. సల్కం చెరువులో ఆక్రమణలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. ఒవైసీ కాలేజీకి మాత్రం ఏడాది సమయం ఎందుకిచ్చారని అడిగారు. అందరికీ ఒకే న్యాయమైతే.. ఒవైసీ కాలేజీనీ కూల్చాలని అన్నారు. ఇక హైడ్రా తెలంగాణ రాష్ట్రంలో ఓ దుమారం రేపుతోంది. హైడ్రాపై పలువురు పొలిటిషీయన్స్ స్పందించి తీవ్ర రూపంలో మండిపడుతున్నారు. హైడ్రా వరుసగా నోటిసులు అందిస్తుంది. దీంతో పలువురి రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు పుడుతుంది. ప్రస్తుతం హైడ్రా హైదరాబాదులో కొనసాగుతోంది. బఫర్ జోన్, ఎఫ్టీఎల్, నాలాలు, కుంటలను ఆక్రమంచి కట్టిన అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడే నేల మట్టం చేస్తుంది.