Bandi Sanjay: చర్యలు తీసుకోకుండా పొడిగింపు ఎందుకు.. కాంగ్రెస్ పై బండి సంజయ్ విమర్శ

by Prasad Jukanti |
Bandi Sanjay: చర్యలు తీసుకోకుండా పొడిగింపు ఎందుకు.. కాంగ్రెస్ పై బండి సంజయ్ విమర్శ
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, కుంభకోణాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ (Congress) పార్టీ తన మేనిఫెస్టోలో బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో పూర్తి స్థాయి విచారణ ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. కానీ ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇటీవల కాళేశ్వరం (Kaleshwaram) న్యాయ విచారణ కమిషన్ గడువును ప్రభుత్వం మరో రెండు నెలల పాటు పొడిగించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఎక్స్ వేదికగా పోస్టు చేసిన బండి సంజయ్.. ఇది అంతులేని పొడిగింపులు అంటూ ధ్వజమెత్తారు.

కాగా కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో అవకతవకలకు సంబంధించి న్యాయ విచారణ చేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. తొలుత 100 రోజుల్లో కమిషన్ విచారణ పూర్తి చేసి నివేదిక అందించాలని ప్రభుత్వం పేర్కొంది. కానీ పలు కారణాలతో విచారణను ఇప్పడి వరకు రెండు సార్లు పొడిగించింది. ఈ క్రమంలో వచ్చే డిసెంబర్ నెలాఖరు వరకు గడువు పొడిగిస్తూ మరోసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed