హాట్ టాపిక్‌గా బండి ప్రకటన.. మళ్లీ తెరపైకి ఆ పంచాయితీ

by Sathputhe Rajesh |
హాట్ టాపిక్‌గా బండి ప్రకటన.. మళ్లీ తెరపైకి ఆ పంచాయితీ
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: బెజ్జంకి మండల పంచాయితీ మళ్లీ తెరపైకి వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా పాలన సౌకర్యం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ మండలంలో వెలువెత్తిన అసంతృప్త జ్వాలలు సద్దుమనుగుతున్న వేళ.. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరితే.. బెజ్జంకి మండలాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతాని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వాఖ్యలు తాజాగా హాట్ టాఫిక్‌గా మారాయి.

రాజకీయ కోణంలో చేసినా వాఖ్యలా...? అధికార పార్టీ నాయకులను ఇరుకున పెట్టేందుకా..? ప్రజల అంకాంక్షల మేరకు ఎంపీ ఆ ప్రకటన చేశారా..? అని మండలంలో విభిన్న వాదలు తెరపైకి రాగా.. బండి వాఖ్యాలు కొత్తగా బెజ్జంకి మండలంలో రాజకీయ వేడిని రగిలించాయి. ప్రజలకు పాలన సౌకర్యాలు మరింత చేరువ చేసే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016లో కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న బెజ్జంకి మండలాన్ని రెండు మండలాలుగా ఏర్పాటు చేసింది.

ఉమ్మడి బెజ్జంకి మండలంలోని 29 గ్రామపంచాయతీల్లో 15 గ్రామ పంచాయతీలతో గన్నేరువరం మండలం ఏర్పాటు చేసి కరీంనగర్ జిల్లాలో, 14 గ్రామ పంచాయతీలతో బెజ్జంకి మండలం ఏర్పాటు చేసి సిద్దిపేట జిల్లాలో కలిపారు. తదనంతరం ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకొవడంతో 23 గ్రామ పంచాయతీలతో బెజ్జంకి మండలం కొనసాగుతుంది. ఇదిలా ఉంటే బెజ్జంకి మండలాన్ని సిద్దిపేట జిల్లాలో కలుపడంపై అప్పటి నుండే నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బెజ్జంకి మండలానికి చెందిన కరీంనగర్ జిల్లా పోరాట సమితి ప్రతినిధులు పార్లమెంట్ బరిలో నిలిచి నిరసన తెలిపారు. దీనికి తోడు మండల వ్యాప్తంగా కరీంనగర్ జిల్లా పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రజలు గవర్నర్‌కు ఉత్తరాలు రాశారు. దీనికి తోడు నాటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైటే 100 రోజుల్లో బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతామని హామీ నిచ్చారు.

ఇదిలా ఉంటే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన ప్రకటన బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపాలని చేపట్టిన ఉద్యమానికి కొత్త ఊపిరిని అందించింది. ఏదీ ఎమైనప్పటకి.. బండి ప్రకటన అటు కరీంనగర్ జిల్లాలో.. ఇటు సిద్దిపేట జిల్లాలో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో జిల్లా అధికార పార్టీ నాయకులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరీ.

Advertisement

Next Story

Most Viewed