మహిళా కమిషన్ ఎదుట బండి.. కొనసాగుతున్న విచారణ

by Mahesh |   ( Updated:2023-03-18 08:00:00.0  )
మహిళా కమిషన్ ఎదుట బండి.. కొనసాగుతున్న విచారణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట శనివారం హాజరయ్యారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని బండికి నోటీసులు జారీ చేసింది. 15న విచారణకు రావాలని ఆదేశించగా.. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బండి శనివారం హాజరవుతానని చెప్పారు.

ఈ మేరకు ఆయన ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు రెండు గంటలుగా విచారణ కొనసాగుతోంది. కాగా బీఆరెస్ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన రికార్డులతో విచారణకు హాజరయ్యారు. వాటిని సుమోటోగా ఎందుకు తీసుకోలేదని అడిగేందుకే ఆ రికార్డులను తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.

Also Read..

పేపర్ లీకేజీకి కేటీఆరే కారణమంటూ.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

Advertisement

Next Story