ఈ రేసింగ్ ఎవరికి ఉపయోగం..?

by samatah |
ఈ రేసింగ్ ఎవరికి ఉపయోగం..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ–రేసింగ్ వలన ఎవరికి ఉపయోగం ఉన్నదంటూ ఎన్​ఎస్​యూ ఐ స్టేట్ చీఫ్​ బల్మూరి వెంకట్​ప్రభుత్వం పై ఫైర్​ అయ్యారు. ఆ రేస్​నిర్వహించడం వలన సామాన్యులకు అవస్థలు ఎదురవుతున్నా..ప్రభుత్వానికి పట్టింపు లేకపోవడం బాధాకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్​నడిబొడ్డున ట్రాఫిక్​అంతరాయం ఏర్పడటంతో ఆయన ఖైరతాబాద్ సిగ్నల్​వద్ద ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలతో ధర్నాచేశారు.

ఈ సందర్భంగా వెంకట్​మాట్లాడుతూ..కొత్త సచివాలయాన్ని ప్రమోషన్ చేసుకోడానికే ఫార్ములా ఈ రేసింగ్ ను ఏర్పాటు చేశారన్నారు.ప్రజలకు కావాల్సింది ఫార్ములా రేసింగ్ లు కాదని, ఫార్మర్స్​ ని నెంబర్​ వన్​ చేస్తే రాష్ట్రం సుబీక్షంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెట్టాల్సిన రేసింగ్ ను నడిబొడ్డున పెట్టి సిటీజనులకు చుక్కలు చూపిస్తున్నారన్నారు. ప్రభుత్వానిఇక చిత్త శుద్ధి ఉంటే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం పై ప్రత్యేక ప్రణాళికలు చేయాలన్నారు. కేవలం బడా బాబులకు కొమ్ముకాస్తూ ,వాళ్ళ సుఖాల కోసం సామాన్య ప్రజలను ఇబ్బందుల పాలు చేయడం సరికాదన్నారు. మరోసారి ఇలాంటి రేసింగ్​ లు సిటీ నడిబొడ్డున పెడితే అడ్డుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్​,రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లలిత్ యాదవ్,రితీశ్ రావు,జాతీయ కో ఆర్డినేటర్ అజయ్,రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి,కుందన్, రంజిత్ ,నందు, దీక్షిత్,పవన్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story