MLC హోదాలో డాక్టర్ అయిన బల్మూరి వెంకట్

by GSrikanth |
MLC హోదాలో డాక్టర్ అయిన బల్మూరి వెంకట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డాక్టర్‌గా నమోదయ్యారు. శుక్రవారం ఆయన తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో డాక్టర్‌గా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు. 2021లో కరీంనగర్‌లోని చల్మెడ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆయన, 2022లో హౌజ్ సర్జన్ కంప్లీట్ చేశారు. తాజాగా ఆయన ఎమ్మెల్సీ హోదాలో డాక్టర్ నమోదు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా టీఎస్ మెడికల్ కౌన్సిల్ కో-ఆప్షన్ మెంబర్ డాక్టర్ రాజీవ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ రాజీవ్ మాట్లాడుతూ.. అతిచిన్న వయసులో ఓ డాక్టర్ ఎమ్మెల్సీ కావడం సంతోషంగా ఉన్నదన్నారు. రాష్ట్రంలోని పేదల ప్రజలకు మేలు నిర్ణయాలు తీసుకోవాలని ఆయన వెంకట్‌ను కోరారు.

Advertisement

Next Story