బాల్క సుమన్ ‘రాసలీలలు’ బయటపెడుతాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Ramesh N |   ( Updated:2024-02-05 17:28:35.0  )
బాల్క సుమన్ ‘రాసలీలలు’ బయటపెడుతాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ బాల్కసుమన్‌పై సంచలన నిజాలు బయటపెడుతామని వెల్లడించారు. ఈ కమ్రంలోనే ఆయన సోమవారం ఒక వీడియో లో విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనరాని భాషలో మాట్లాడారని ఫైర్ అయ్యారు. తప్పకుండా ఆయనకు శుద్ధి జరుగుతదన్నారు.

బాల్కసుమన్‌ను అస్సలు వదిలిపెట్టామని, తను ఎక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రజలు శిక్షిస్తారని అన్నారు. రేపటి నుంచి జిల్లాలకు వచ్చినప్పుడు తనకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ‘నువ్వు చేసిన కథలన్నీ ఉన్నాయి. రేపటి నుంచి మొదలు పెడతా. రాసలీలలు అన్నీ ఉన్నాయి అవన్నీ బయటపెడతాం. బతుకు బజారుకీడుస్తాం’ అని హెచ్చరించారు.

Advertisement

Next Story