- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మిషన్‌భగీరథ నిధులు మింగారు.. ఎమ్మెల్యే ఆరూరిపై బక్క జడ్సన్ ఈడీకి ఫిర్యాదు
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్మిషన్భగీరథ నిధులను భారీగా స్వాహా చేశారంటూ సీనియర్కాంగ్రెస్నాయకుడు బక్క జడ్సన్ బుధవారం ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలో వర్ధన్నపేట, పర్వతగిరి, హసన్‌పర్తి మండలాలు ఉన్న విషయం తెలిసిందే.
కాగా, ప్రజలకు తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రారంభించిన మిషన్‌భగీరథ కార్యక్రమాన్ని వర్ధన్నపేట నియోజకవర్గంలో కూడా అమలు చేశారు. ఈ పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ల నుంచి ఎమ్మెల్యే రమేశ్భారీ మొత్తంలో కమీషన్లు తీసుకుని.. చాలా వరకు పనులు పూర్తి చేయలేదని బక్క జడ్సన్తన ఫిర్యాదులో ఆరోపించారు.
2014లో వర్ధన్నపేట స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసినపుడు రమేశ్తన ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో రూ. 14, 94, 52, 206 పేర్కొన్నట్టు తెలిపారు. 2018 ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువను రూ. 28, 39, 80, 047 కోట్లుగా తెలియచేశారన్నారు.
ఈ క్రమంలో నాలుగేళ్లలో ఎమ్మెల్యే రమేశ్ఆస్తులు వంద శాతం పెరిగిన విషయం స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారన్న దానికి ఇదే నిదర్శనమన్నారు. తన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని కోరారు.